దేశీవాలీ లీగ్ నుంచి షేన్ వాట్సన్ రిటైర్మెంట్

దేశీవాలీ లీగ్ నుంచి షేన్ వాట్సన్ రిటైర్మెంట్

Updated On : April 26, 2019 / 7:15 AM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత దేశీవాలీ లీగ్‌లలో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2017సీజన్ వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఆడి.. 2018 సీజన్‌లో సూపర్ కింగ్స్ లోకి అడుగుపెట్టాడు. 

దీంతో పాటుగా ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వహిస్తోన్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లోనూ కొనసాగుతున్నాడు. లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వాట్సన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్ ఐదో సీజన్‌కు తాను హాజరుకాలేనంటూ రాజీనామాను ప్రకటించాడు. దీనిపై వచ్చే సీజన్‌లోపు లీగ్ యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ రిటైర్మెంట్ నిర్ధారణ అయితే మాత్రం వాట్సన్ స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్‌ను తీసుకోవాలని జట్టు ఆసక్తి కనబరుస్తోంది. 

ప్రపంచ వ్యాప్తంగా జరిగే దేశీవాలీ లీగ్‌లలో ఆసక్తి చూపిస్తున్న వాట్సన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు మాత్రం కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు సమయం లేదని చెప్తుండటం శోచనీయం. 37ఏళ్ల ఈ ఆల్ రౌండర్ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఒక మ్యాచ్‌లో 96పరుగులు చేసి చక్కటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 
Also Read : మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్…స్టే విధించిన క్యాట్