Shreyas iyer 1st captain to lose 4 matches while defending 200 plus in ipl history
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయిన కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడు ధోనిని అధిగమించాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ నాలుగు సందర్భాల్లో రెండు వందల కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాలను కాపాడుకోలేకపోయాడు. దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని, ఫాప్ డుప్లెసిస్, శుభ్‌మన్ గిల్‌లు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వీరంతా తలా మూడు సందర్భాల్లో 200+ పరుగుల లక్ష్యాలను కాపాడుకోలేదు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200+ పరుగులను కాపాడుకోలేకపోయిన కెప్టెన్లు వీరే..
*శ్రేయస్ అయ్యర్ – 4 సార్లు
* ఎంఎస్ ధోని – 3 సార్లు
* ఫాప్ డుప్లెసిస్ – 3 సార్లు
* శుభ్‌మన్ గిల్ – 3 సార్లు
శ్రేయస్ కెప్టెన్సీలో 200 ప్లస్ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన సందర్భాలు ఇవే..
* 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 223 పరుగులు (కేకేఆర్ కెప్టెన్‌గా)
* 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 261 పరుగులు (కేకేఆర్ కెప్టెన్‌గా)
* 2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 245 పరుగులు (పంజాబ్ కెప్టెన్‌గా)
* 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 206 పరుగులు (పంజాబ్ కెప్టెన్‌గా)
ఇక జట్ల విషయానికి వస్తే..
పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ఫ్లస్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. 7 సందర్భాల్లో ఆ జట్టు 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోలేక అపఖ్యాతిని మూటగట్టుకుంది.
200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు కాపాడుకోలేకపోయిన జట్లు ఇవే..
* పంజాబ్ – 7 సార్లు
* ఆర్‌సీబీ – 6 సార్లు
* సీఎస్‌కే – 5 సార్లు
* కేకేఆర్ – 4 సార్లు
* గుజరాత్ – 4 సార్లు
* రాజస్థాన్ – 2 సార్లు
* ఎస్‌ఆర్‌హెచ్ – 2 సార్లు
* ఢిల్లీ – 2 సార్లు
* లక్నో – 2 సార్లు