Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. నిజంగానే మ‌న‌సున్న మా రాజు.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వెన్నునొప్పి కార‌ణంగా గ‌త కొంత‌కాలంగా ఆట‌కు దూరం అయ్యాడు. శ‌స్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న అయ్య‌ర్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో పున‌రావాసం పొందుతున్నాడు.

Shreyas Iyer

Shreyas Iyer distributes cash : టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) వెన్నునొప్పి కార‌ణంగా గ‌త కొంత‌కాలంగా ఆట‌కు దూరం అయ్యాడు. శ‌స్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న అయ్య‌ర్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో పున‌రావాసం పొందుతున్నాడు. అక్క‌డ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. కాగా.. అయ్య‌ర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా అయ్య‌ర్ ను మెచ్చుకుంటూ ఉన్నారు.

బుధ‌వారం ఓ ప‌ని నిమిత్తం శ్రేయ‌స్ బ‌య‌ట‌కు వెళ్లాడు. ప‌ని పూర్తి అయ్యాక కారు వ‌ద్ద‌కు వ‌చ్చి ఎక్కుతుండ‌గా ఓ వ్య‌క్తి త‌న బిడ్డ‌తో క‌లిసి అక్క‌డ‌కు వ‌చ్చాడు. సాయం చేయ‌మ‌ని అడిగాడు. వారిని న‌వ్వుతూ ప‌ల‌కరించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ అత‌డి పేరు అడిగితెలుసుకున్నాను. అత‌డి మాట‌లు విని వెంట‌నే త‌న జేబులో నుంచి కొంత న‌గ‌దు తీసి వారికి ఇచ్చాడు. మ‌రో వ్య‌క్తి రాగా అత‌డికి కూడా డ‌బ్బు ఇచ్చాడు. దీన్ని ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెట్టింట్ట వైర‌ల్‌గా మారింది. మన‌సున్న మా రాజు నీవే అంటూ నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ODI World Cup : టీమ్ఇండియాను వేధిస్తున్న నంబ‌ర్ 4 స‌మ‌స్య‌.. ఎవరూ ఊహించని సజెషన్.. మేనేజ్‌మెంట్ అంగీక‌రించేనా..?

టీమ్ఇండియాను గ‌త కొంతకాలంగా నంబ‌ర్ 4 స‌మ‌స్య వేధిస్తోంది. యువ‌రాజ్ సింగ్ రిటైర్‌మెంట్ త‌రువాత ఆ స్థానంలో ఎంతో మంది ఆట‌గాళ్లు ఆడారు. సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే, సంజు శాంస‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌తో పాటు ప‌లువురు ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు. అయితే.. వీరంద‌రిలో ఒక్క శ్రేయ‌స్ గ‌ణంకాలు మాత్ర‌మే కాస్త మెరుగ్గా ఉన్నాయి. అత‌డు ఆ స్థానంలో నిల‌క‌డ‌గా రాణించాడు.

దీంతో టీమ్ఇండియా నంబ‌ర్ 4 క‌ష్టాలు తీరిన‌ట్లేన‌ని, ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా అయ్య‌రే ఆ స్థానంలో బ‌రిలోకి దిగుతాడ‌ని అంతా బావిస్తున్న స‌మ‌యంలో వెన్ను నొప్పి గాయంతో అత‌డు ఆట‌కు దూరం అయ్యాడు. దీంతో టీమ్ఇండియా నంబ‌ర్ 4 క‌ష్టాలు మొద‌టికి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అయ్య‌ర్ వెన్ను నొప్పి గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడు. అయితే.. అత‌డు పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడా..? లేదా అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ఈ నెల 20వ తేదీన ఆసియా క‌ప్‌కు టీమ్ఇండియా జ‌ట్టును సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రీ శ్రేయ‌స్‌కు చోటు ఇస్తారో లేదో చూడాల్సిందే.

Asia Cup : ఓ సారి టీ20, మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌.. ఇలా ఎందుకంటే..?

ట్రెండింగ్ వార్తలు