IND vs BAN 1st Test : సెంచరీలతో సత్తాచాటిన గిల్, పంత్.. బంగ్లా ముందు భారీ టార్గెట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. విజయం దిశగా పయణిస్తుంది.

Shubman Gill, Rishabh Pant

IND vs BAN 1st Test Day 3rd : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. విజయం దిశగా పయణిస్తుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. మళ్లీ భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగుల చేసింది. అప్పటికే 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. క్రీజులో శుభమన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) ఉన్నారు. మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చిన గిల్, పంత్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.

Also Read : Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. భారత్ నుంచి 10వ బౌలర్..

రిషబ్ పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు నాలుగు సిక్సులు ఉన్నాయి. శుభమన్ గిల్ 176 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సుల సహాయంతో 119 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పంత్ 109 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో కేఎల్ రాహల్ క్రీజులోకి వచ్చాడు. 19 బాల్స్ లో 22 పరుగులు చేశాడు. దీంతో 64 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా 287 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశారు. మొదటి ఇన్సింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని భారత్ జట్టు 514 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ముందు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.