Shubman Gill Confirms Jasprit Bumrah will play 3rd Test against england
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపింది. 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.
608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (88) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 6 వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులే చేసింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ENG vs IND : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.. పిచ్ పై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి విజయం. అయినప్పటికి ఓ అరుదైన ఘనత సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్ అనంతరం గిల్ చెప్పాడు. తొలి టెస్టులో ఓడిపోయినప్పటికి రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్‌లో పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పాడు.
ఇక భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక మైన మూడో టెస్టు మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు ఉంటాయని గిల్ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే వ్యాఖ్యానించాడు. గెలిచిన జట్టుతో మూడో టెస్టులో ఆడట్లేదన్నాడు.
Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ శాంసన్ జాక్ పాట్.. వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా..
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌కు టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడు మూడో టెస్టు మ్యాచ్‌లో ఖచ్చితంగా ఆడతాడని గిల్ తెలిపాడు. ఇక లార్డ్స్‌లో ఆడేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాతి స్టేడియంలో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కల అని, అక్కడ దేశానికి కెప్టెన్‌గా ఉండడాన్ని ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గిల్ చెప్పాడు.
రెండో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు బుమ్రా రావడంతో అతడి స్థానంలో వచ్చిన ఆకాశ్ దీప్‌ను తప్పిస్తారా? లేదంటే సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ లలో ఎవరి పై వేటు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.