Shubman Gill creates history MOST HUNDREDS FOR INDIA IN WTC
Shubman Gill : ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో చెలరేగాడు. ఖరీ పియర్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 177 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ బాది మూడు అంకెల స్కోరు సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా భారత గడ్డ పై తొలి సెంచరీ కావడం గమనార్హం.
కాగా.. ఈ క్రమంలోనే గిల్ (Shubman Gill ) ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్ డబ్ల్యూటీసీలో 9 శతకాలు చేయగా గిల్ 10 సెంచరీలు చేశాడు.
* శుభ్‌మన్ గిల్ – 10 సెంచరీలు
* రోహిత్ శర్మ – 9 సెంచరీలు
* యశస్వి జైస్వాల్ – 7 శతకాలు
* రిషబ్ పంత్ – 6 శతకాలు
* కేఎల్ రాహుల్ – 6 శతకాలు
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు టెస్టు శతకాలు..
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు శతకాలు సాధించిన ఆటగాళ్లు జాబితాలో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లీ ఈ ఘనతను 2017, 2018 సీజన్లలో నమోదు చేశాడు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు టెస్టు శతకాలు చేసిన భారత కెప్టెన్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 2017లో
* విరాట్ కోహ్లీ – 2018లో
* శుభ్‌మన్ గిల్ – 2025లో
సునీల్ గవాస్కర్, కుక్ తరువాత..
కెప్టెన్‌గా 5 టెస్టు సెంచరీలను అత్యంత వేగంగా చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో నిలిచాడు. అతడి కన్నా ముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కుక్, భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌లు ఉన్నారు. కుక్ 9 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయగా, గవాస్కర్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక శుభ్‌మన్ గిల్ విషయానికి వస్తే.. 12 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 9 ఇన్నింగ్స్‌లు
* సునీల్ గవాస్కర్ (భారత్) – 10 ఇన్నింగ్స్‌లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 12 ఇన్నింగ్స్‌లు