Yashasvi Jaiswal : ఏంటి జైస్వాల్ ఇలా చేశావ్.. 175 రన్స్ కొట్టి కూడా ఇప్పుడు చూడు ‘అలాంటి రికార్డు’ల్లో చేరావ్..!
వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) రనౌట్ అయ్యాడు.

Jaiswal Joins Dravid In Unwanted List After Horrendous Run Out
Yashasvi Jaiswal : ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు. 258 బంతుల్లో 22 ఫోర్లు బాది 175 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు.
కాగా.. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఓ అవాంచనీయమైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇందులో రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్ వంటి వారు ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 173 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన జైస్వాల్ మరో రెండు పరుగులు జోడించి రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అత్యదిక స్కోర్లు సాధించి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో సంజయ్ మంజ్రేకర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1989లో లాహోర్‌లో పాక్ పై జరిగిన మ్యాచ్ మంజ్రేకర్ 218 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక రెండో స్థానంలో ద్రవిడ్ ఉన్నాడు. 2002లో ది ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్ పై 217 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
రనౌట్‌తో ముగిసిన భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే..
* సంజయ్ మంజ్రేకర్ – 218 (పాకిస్తాన్ పై 1989లో లాహోర్ వేదికగా)
* రాహుల్ ద్రవిడ్ – 217 (ఇంగ్లాండ్ పై 2002లో ఓవల్ వేదికగా)
* రాహుల్ ద్రవిడ్ – 180 (ఆస్ట్రేలియా పై 2001లో కోల్‌కతా వేదికగా)
* యశస్వి జైస్వాల్ – 175 (వెస్టిండీస్ పై 2025లో ఢిల్లీ వేదికగా)
* విజయ్ హజారే – 155 (ఇంగ్గాండ్ పై 1951లో ముంబై వేదికగా)
* రాహుల్ ద్రవిడ్ – 144 (శ్రీలంక పై 2009లో కాన్పూర్ వేదికగా)