Shubman Gill : రిషబ్ పంత్, రోహిత్ శర్మల రికార్డులు బ్రేక్ చేసిన టీమ్ఇండియా ప్రిన్స్.. డబ్ల్యూటీసీలో ఒకే ఒక భారతీయుడు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC) చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) రికార్డులకు ఎక్కాడు.

Shubman Gill surpasses Rohit and Pant to create all time record in WTC history
Shubman Gill : టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓ భారీ రికార్డును సాధించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC) చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను అధిగమించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో పంత్ 67 ఇన్నింగ్స్‌ల్లో 2731 పరుగులు చేయగా.. గిల్ 71 ఇన్నింగ్స్‌ల్లో 2771 పరుగులు సాధించాడు.
ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ, జడేజాలు వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు.
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) – 2771* పరుగులు
* రిషబ్ పంత్ – 2731 పరుగులు
* రోహిత్ శర్మ- 2716 పరుగులు
* విరాట్ కోహ్లీ – 2617 పరుగులు
* రవీంద్ర జడేజా – 2515 పరుగులు
CSK : ఎందుకు తొందర.. మేము చెబుతాముగా.. సోషల్ మీడియాలో సీఎస్‌కే పోస్ట్..
మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు లంచ్ విరామానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 427 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (75), ధ్రువ్ జురెల్ (7)లు క్రీజులో ఉన్నారు.