CSK : ఎందుకు తొందర.. మేము చెబుతాముగా.. సోషల్ మీడియాలో సీఎస్‌కే పోస్ట్..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మినీ వేలం (IPL Auction) జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లను ఈ వేలం కోసం సీఎస్కే (CSK)విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది

Chennai Super Kings Break Silence On Reports Of Releasing Players
CSK : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాణించేందుకు ఇప్పటికే సీఎస్‌కే (CSK) తమ జట్టులో మార్పులు చేర్పులు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మినీ వేలం (IPL Auction) జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లను ఈ వేలం కోసం సీఎస్కే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సామ్ కరన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డేవాన్ కాన్వేను వదివివేస్తున్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Don’t worry, we’ve updated the bio 😉
— Chennai Super Kings (@ChennaiIPL) October 10, 2025
ముఖ్యంగా దూకుడుగా ఆడే కాన్వే, ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌ను వదిలివేయవద్దు అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలపై సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఎవరూ కంగారు పడొద్దు.. మేమే అప్‌డేట్ చేస్తాం అని సీఎస్‌కే పోస్ట్ చేసింది.
IND vs WI 2nd Test : టీ బ్రేక్ సమయంలో జైస్వాల్‌కు ఒకటే చెప్పాను.. బ్యాటింగ్ సితాన్షు కోటక్
ఈ ఐదుగురిని వదిలివేయడం ద్వారా సీఎస్‌కేకు పెద్ద మొత్తమే మిగలనుంది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సీఎస్‌కేకు రూ.9.75 కోట్లు పర్స్ వాల్యూ లభించింది.