Rishabh Pant
Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్‌లో 2-1తో తేడాతో ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. నాల్గో టెస్టు మ్యాచ్ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ టెస్టు మ్యాచ్‌కు భారత్ జట్టుకు చెందిన ఇద్దరు కీలక ప్లేయర్లు దూరమవుతున్నారని తెలుస్తోంది.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఇంగ్లాండ్‌తో జరిగే నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. రిషబ్ పంత్ కు గాయమైన విషయం తెలిసిందే. మూడో టెస్టులో తొలిరోజు రెండో సెషన్‌లో పంత్ ఎడమ చేతి చూపుడు వేలుకు గాయమైంది. కీపింగ్ చేస్తున్న సమయంలో గాయం కావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తరువాత ఒకటిరెండు ఓవర్లు కీపింగ్ చేసిన పంత్.. నొప్పి ఎక్కువ కావడంతో మైదానంను వీడి వెళ్లిపోయాడు. ఆ తరువాత భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో పంత్ మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. పంత్ కేవలం బ్యాటింగ్ సమయంలో మాత్రమే మైదానంలోకి వచ్చాడు.
మూడో టెస్టు అనంతరం రిషబ్ పంత్ గాయంపై శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు. అతనికి పెద్దగా గాయం కాలేదు. మాంచెస్టర్‌లో జరిగే నాల్గో టెస్టు వరకు పంత్ కోలుకుంటాడని భావిస్తున్నామని చెప్పాడు. అదే సమయంలో జస్ర్పీత్ బుమ్రాసైతం నాల్గో టెస్టు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. బుమ్రా విషయంపై గిల్ మాట్లాడుతూ.. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండటంపై త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని చెప్పాడు.
Chase mode ON! No better way to start Day 5! 💪
Played with intent! @RishabhPant17 gets the first boundary of the day! 🇮🇳#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/HidKp0RrjV
— Star Sports (@StarSportsIndia) July 14, 2025