జడేజాతోనే ఆటలా.. ఇంగ్లాండ్ బౌలర్‌కు గట్టి గుణపాఠం చెప్పిన జడ్డూ.. స్టోక్స్ అడ్డురాకుంటే చిన్నపాటి యుద్ధమే జరిగేది.. వీడియో వైరల్

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రవీంద్ర జడేజా, బ్రైడాన్ కార్స్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

జడేజాతోనే ఆటలా.. ఇంగ్లాండ్ బౌలర్‌కు గట్టి గుణపాఠం చెప్పిన జడ్డూ.. స్టోక్స్ అడ్డురాకుంటే చిన్నపాటి యుద్ధమే జరిగేది.. వీడియో వైరల్

Ravindra Jadeja, Brydon Carse

Updated On : July 15, 2025 / 7:35 AM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఐదో రోజు (సోమవారం) ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి వరకు విజయంకోసం భారత ప్లేయర్లు పోరాడారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌తో చివరి వరకు ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

Also Read: అదే మా కొంపముంచింది.. అతను రనౌట్ కాకుంటే.. మూడో టెస్టులో ఓటమిపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్..

ఐదో రోజు 58/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలు పెట్టిన భారత్ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి 112 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు.. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. దీంతో జడేజాకు చిరాకు తెప్పించేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు పలు ప్రయత్నాలు చేశారు.


35వ ఓవర్లో బ్రైడాన్ కార్స్ బౌలింగ్ చేశాడు. ఆఖరి బంతికి జడేజా ఆఫ్‌సైడ్ షాట్ ఆడి సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్రైడాన్ కార్స్ అడ్డొచ్చాడు. జడేజా అతన్ని ఢీకొని ముందుకెళ్లే ప్రయత్నంలో కార్స్ జడేజా భుజాన్ని పట్టుకున్నట్లు కనిపించింది. వెంటనే అతన్ని విడిపించుకొని జడేజా రెండు పరుగులు పూర్తి చేశాడు. ఆ వెంటనే బ్రైడాన్ కార్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని వద్దకు వెళ్లి ఎందుకిలా చేశావ్..? అంటూ జడేజా ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.


ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారుతున్న క్రమంలో అక్కడేఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జోక్యం చేసుకొని వారిద్దరికి సర్దిచెప్పాడు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియో చూస్తే.. జడేజాను కిందపడేయాలని బ్రైడాన్ కార్స్ కావాలనే అడ్డు తగిలినట్లుగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంగ్లాండ్ బౌలర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.