అదే మా కొంపముంచింది.. అతను రనౌట్ కాకుంటే.. మూడో టెస్టులో ఓటమిపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్..
మూడో టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

Shubman Gill
ENG vs IND: ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) విరోచిత పోరాటం చేశాడు. మూడో టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
గిల్ మాట్లాడుతూ.. ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను అభినందించాడు. మేము గెలుపు కోసం చివరి సెషన్, చివరి వికెట్ వరకు ప్రయత్నించాం. కానీ, దురదృష్టవశాత్తూ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఐదో రోజు వికెట్లు చేతిలో ఉండటంతో టార్గెట్ ను తేలిగ్గా చేజ్ చేస్తామని అనుకున్నాం. కానీ, ఇంగ్లాండ్ బౌలర్లు తమపై పైచేయి సాధించారు. టాపర్డర్ లో 50 పరుగుల భాగస్వామ్యాలు ఒకట్రెండు వచ్చిఉంటే టీమిండియా గెలుపు సాధ్యమయ్యేంది. కానీ, మేము అలాచేయలేకపోయాం.
ONE OF THE MOST HEARTBREAKING MOMENTS IN INDIAN TEST HISTORY 💔 pic.twitter.com/nTNR5FGaTh
— Johns. (@CricCrazyJohns) July 14, 2025
రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడాడు. అతను క్రీజులో ఉండటంతో గెలుస్తామని చాలా నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. డ్రెస్సింగ్ రూం నుంచి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. బుమ్రా, సిరాజ్ సైతం అతడికి సహకరించారు. కానీ, దురదృష్టం భారత జట్టును వెంటాడింది. ఆఖరిలో మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ రనౌట్ ఆటను మలుపు తిప్పింది. మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 50 నుంచి 60 పరుగుల వరకు మేము ఆధిక్యం సాధిస్తామని అనుకున్నాం. కానీ, పంత్ రనౌట్ కావడంతో అంతా తారుమారైంది.
లార్డ్స్ పిచ్‌పై 150 నుంచి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు.. అందుకే మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం పొందాలని భావించాం. కానీ, మేము అనుకున్నది జరగలేదు. మా తప్పిదాలను సరిదిద్దుకొని రాబోయే రెండు టెస్టుల్లో విజయం సాధించేలా ప్రయత్నిస్తామని శుభ్‌మన్ చెప్పారు.
A STANDING OVATION FOR JADEJA & STOKES 🥺 pic.twitter.com/6jVQb8NMZk
— Johns. (@CricCrazyJohns) July 14, 2025