Rinku Singh-Shubman Gill sister Shahneel
Rinku Singh-Shahneel: ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL) సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) అద్భుతంగా రాణించాడు. కేకేఆర్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 28 పరుగులు కావాల్సి ఉండగా చివరి ఐదు బంతులను సిక్స్‌లుగా మలిచి కోల్‌కతాకు నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. రింకూ సింగ్ రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో కోల్‌కతా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో అలసిపోయిన రింకూ సింగ్ సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫోటోల్లో తన సిక్స్-ప్యాక్ అబ్స్‌ను ప్రదర్శిస్తూ ఉన్నాడు. “హెచ్చరిక: వ్యవసానికి గురిచేసే కంటెంట్ ఇక్కడ ఉంది.” అంటూ ఆ ఫోటోల కింద చమత్కరించాడు. ఇంతకముందు ఎన్నడూ ఇలాంటి ఫోటోలను రింకూ పోస్ట్ చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rinku Singh: సిక్స్ ప్యాక్ చూపిస్తున్న క్రికెటర్ రింకూ సింగ్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
కాగా.. ఈ ఫోటోలపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అయితే.. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, టీమ్ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. రింకూ సింగ్ సిక్స్‌ప్యాక్ చూపెడుతున్న ఫోటో పై “ఓ హీరో” అంటూ ఆమె కామెంట్ చేసింది. కాగా.. షహనీల్ గిల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్‌లు మంచి స్నేహితులు.
Rinku-Shahneel
Shubman Gill: ఆర్‌సీబీ ఓటమికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోదరిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఓ వర్గం అభిమానులు శుభ్‌మన్ గిల్ తోపాటు అతడి సోదరి అయిన షహనీల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడంతో షహనీల్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి శతకం చేయగా.. ఛేదనలో గిల్ మెరుపు సెంచరీ చేయడంతో ఆర్‌సీబీ ఓడిపోయింది.