Rinku Singh: సిక్స్ ప్యాక్ చూపిస్తున్న క్రికెటర్ రింకూ సింగ్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
రింకూ సింగ్ ఐపీఎల్-2023లో మొత్తం 14 మ్యాచులు ఆడి 474 పరుగులు బాదాడు.

Rinku Singh
Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భారీ సిక్సర్లు బాది అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్ రింకూ సింగ్ ప్రస్తుతం మాల్దీవుల్లో (Maldives) ఎంజాయ్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్ చూపుతూ అతడు తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ముగియడంతో విశ్రాంతి దొరకడంతో అతడు మాల్దీవులకు వెళ్లాడు.

Rinku Singh

Rinku Singh
నీళ్లలో జలకాలాడుతూ స్టైలిష్ గా రింకూ సింగ్ ఈ ఫొటోలు తీసుకున్నాడు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ” హెచ్చరిక: వ్యవసానికి గురిచేసే కంటెంట్ ఇక్కడ ఉంది ” అంటూ చమత్కరించాడు. రింకూ సింగ్ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రింకూ సింగ్ ఐపీఎల్-2023లో మొత్తం 14 మ్యాచులు ఆడి 474 పరుగులు బాదాడు. అత్యధిక స్కోరు 67 (నాటౌట్). నాలుగు హాఫ్ సెంచరీలు, 29 సిక్సులు, 31 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్ లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు రింకూ సింగ్.
View this post on Instagram