IND vs SL : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు ముందు భార‌త్‌కు షాక్‌..

శ్రీలంక జ‌ట్టుతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

Mohammed Siraj injured

India vs Sri Lanka : శ్రీలంక జ‌ట్టుతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీల గైర్హ‌జ‌రీలో భార‌త పేస్ ద‌ళాన్ని ముందుండి న‌డిపించాల్సిన మ‌హ్మ‌ద్ సిరాజ్ గాయ‌ప‌డ్డాడు. గురువారం భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ చేస్తుండ‌గా బంతి అత‌డి కాలిని బ‌లంగా తాకిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో అత‌డు నొప్పితో విల‌విల‌లాడాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి ట్రీట్‌మెంట్ అందించాడు.

ఆ త‌రువాత నొప్పి నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందిన‌ప్ప‌టికి కూడా సిరాజ్ త‌రువాత ప్రాక్టీస్ చేయ‌లేదు. కాగా.. అత‌డి గాయం తీవ్ర‌త‌పై ఎలాంటి స‌మాచారం లేదు. శ‌నివారం లంక‌తో జ‌ర‌గ‌నున్న తొలి టీ20కి సిరాజ్ దూరం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సిరాజ్ గ‌నుక తొలి టీ20కి దూరం అయితే టీమ్ఇండియాకు అది ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

Suryakumar Yadav : కొత్త కోచ్ గౌత‌మ్ గంభీర్ పై సూర్య‌కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. మా ఇద్ద‌రి మ‌ధ్య‌..

అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ల‌తో పాటు సిరాజ్ లంక‌తో టీ20ల్లో పేస్ బాధ్య‌త‌లు మోయ‌నున్నార‌ని భావించారు. అయితే.. ఇప్పుడు సిరాజ్ గ‌నుక గాయంతో దూరం అయితే అత‌డి స్థానంలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్‌ల‌లో ఒక‌రు తుది జ‌ట్టులోకి రావొచ్చు. లేదంటే వ‌న్డే జ‌ట్టులో ఉన్న హ‌ర్షిత్ రాణాను సిరాజ్ స్థానంలో ఉప‌యోగించుకునే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని ప‌లువురు క్రీడాపండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. సిరాజ్‌ గాయం పై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న తెలుగు తేజాలు వీరే.. లిస్ట్‌లో 8 మంది

భార‌త టీ20 జ‌ట్టు..
సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), రింకూ సింగ్, రియాన్ ప‌రాగ్, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్ష‌ర్ ప‌టేల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వి బిష్ణోయ్, అర్ష‌దీప్ సింగ్, ఖ‌లీల్ అహ్మ‌ద్, మ‌హ్మ‌ద్ సిరాజ్.

ట్రెండింగ్ వార్తలు