Suryakumar Yadav : కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మా ఇద్దరి మధ్య..
సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌తో తనకు గల అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

Suryakumar reveals special relationship with coach Gambhir
Suryakumar Yadav – Gautam Gambhir : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, నయా సారథి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌తో తనకు గల అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ ఉన్న సమయంలో ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ అరంగ్రేటం చేశాడు. ఈ విషయాన్నే సూర్య ప్రస్తావించాడు. గంభీర్ నాయకత్వంలోనే కేకేఆర్‌కు ఆడానని, ఆ తరువాత నుంచే తనకు మెరుగైన అవకాశాలు లభించాయన్నాడు. గంభీర్‌కు తనకు మద్య ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నాడు. నేను ఎలా ఆడతానో, ఎలా ఆలోచిస్తానో అనే విషయాలు అతడికి తెలుసుని చెప్పుకొచ్చాడు.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న తెలుగు తేజాలు వీరే.. లిస్ట్‌లో 8 మంది
అదే విధంగా కోచ్‌గా గంభీర్ ఎలా పని చేస్తాడో అన్న విషయాలు తనకు తెలుసునని అన్నాడు. ఇక మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆసక్తి తనలోనూ ఉందన్నాడు. ఇక కెప్టెన్సీ విషయమై స్పందిస్తూ.. సారథి కానీ సమయంలోనూ మైదానంలో నాయకుడిగా ఉండేందుకు ఇష్టపడతానని సూర్య అన్నాడు. తన కెరీర్‌లో ఎంతో మంది కెప్టెన్లను దగ్గర నుంచి చూశానని, వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్లుగా చెప్పాడు. ఇక నాయకత్వ బాధ్యతలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నాడు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని సూర్య తెలిపాడు.
రేపు(జూలై 27) శనివారం నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జూలై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచులకు పల్లెకలె వేదిక కానుంది. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ఇండియా వన్డే సిరీస్‌లో ఆడనుంది.
?????????? ????? ????? ????? ?? #?????????‘? ???? ???????! ?#SLvIND | @surya_14kumar pic.twitter.com/KmWz84jZnP
— BCCI (@BCCI) July 26, 2024