Siraj With A Classy Reply I Took 20 Wickets In BGT Too
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో 23 వికెట్లు తీసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. ఇక ఆఖరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ గిల్‌తో కలిసి సిరాజ్ మీడియా సమావేశానికి వచ్చాడు. అక్కడ సిరాజ్‌కు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. అందుకు సిరాజ్ తనదైన శైలిలో సూపర్ కౌంటర్ ఇచ్చాడు.
Team India : బుమ్రా నుంచి నాయర్ వరకు.. విండీస్‌తో సిరీస్‌కు ఈ ఏడుగురు ఆటగాళ్లకు చోటు కష్టమే?
ఓ జర్నలిస్ట్ ప్రస్తుత సిరీస్ గురించి కాకుండా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి అడిగాడు. ఆ సిరీస్‌లో ఓ మాదిరి ప్రదర్శన చేసిన మీరు ఇప్పుడు ఇంత బాగా ఎలా రాణించారు అని అడిగాడు. దీనికి సిరాజ్ నవ్వుతూ.. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ 20 వికెట్లు తీసినట్లుగా చెప్పాడు. దీంతో సదరు జర్నలిస్టు సైలెంట్ అయ్యాడు.
బుమ్రాతో బౌలింగ్ చేస్తున్నప్పుడు తన పని అతడికి సహకారం అందించడమే అని సిరాజ్ చెప్పాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడుతారు. అందుకనే వారు మిగిలిన బౌలర్ల పై ఎదురుదాడి చేయాలని భావిస్తారు. అలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. వరుసగా రెండు సిరీసుల్లోనూ 20కి పైగా వికెట్లు తీయడం ఆనందంగా ఉందన్నాడు.
Jasprit Bumrah : బుమ్రా ఇక నువ్వు టెస్టులకు రిటైర్‌మెంట్ ఇవొచ్చు.. ఆ ముగ్గురు ఉన్నారు?
మూడో బౌలర్‌గా..
ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా సిరాజ్ ఓ ఘనత సాధించాడు. విదేశీ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో 20కి పైగా వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. అతడి కన్నా ముందు కపిల్ దేవ్, జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఈ ఘనత సాధించారు.