Jasprit Bumrah : బుమ్రా ఇక నువ్వు టెస్టులకు రిటైర్‌మెంట్ ఇవొచ్చు.. ఆ ముగ్గురు ఉన్నారు?
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మూడు పార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు.

Mohammed Siraj, Prasidh Krishna and Akash Deep new tro for india pace
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మూడు పార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. అతడి పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్. అతడు వేసే బంతులు రాకెట్ వేగంతో దూసుకువస్తుంటే వాటిని ఎదుర్కొనడం ఎంతటి కాకలుతీరిన బ్యాటర్లకు అయినా కష్టమే. అయితే.. అతడు ఇటీవల కాలంలో తరుచుగా గాయాల బారిన పడుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తీరిక లేని షెడ్యూల్ వల్ల అతడి శరీరం పై విపరీతమైన భారం పడుతోంది.
ఈ క్రమంలోనే అతడిని కాపాడుకోవడానికి టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతడిని ముఖ్యమైన సిరీసుల్లో ముఖ్యమైన మ్యాచ్‌ల్లోనే ఆడిస్తోంది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే అతడిని ఆడించింది.
Team India : నెలరోజులు టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్.. తదుపరి ఆసియా కప్..
ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా మెరుగైన ప్రదర్శననే చేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండడం గమనార్హం. అయితే.. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో (తొలి, మూడో టెస్టులో) భారత్ ఓడిపోయింది. నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా చేసుకుంది. అయితే.. బుమ్రా ఆడని రెండో, ఐదో టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడం గమనార్హం.
ఇక్కడ బుమ్రాను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అతడు జట్టులో ఉన్నప్పుడు అతడికి మిగిలిన బౌలర్ల నుంచి సహకారం అందలేదు. అతడు లేనప్పుడు రెండో టెస్టులో ఆకాశ్ దీప్ 10 వికెట్లతో సత్తా చాటగా, ఐదో టెస్టులో సిరాజ్ ఎంతటి మేటి ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Team India : ఒకే ఒక్క సిరీస్.. అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడు..!
బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలు ప్రంట్ లైన్ పేసర్లుగా ఉన్నారు. వీరితో పాటు ఇంకా టెస్టుల్లో అరంగ్రేటం చేయని అర్ష్ దీప్ సింగ్ తో పాటు ఒకే ఒక మ్యాచ్ ఆడిన అన్షుల్ కాంబోజ్‌లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన కెరీర్‌ను పొడిగించుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.
ఇంగ్లాండ్ గడ్డ పై రాణించిన సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన పేస్ త్రయంతో భారత పేస్ విభాగం పటిష్టంగానే ఉందని అంటున్నారు.