Harmanpreet Kaur : ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో ఓట‌మి.. భార‌త్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మి పై టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ స్పందించింది.

Harmanpreet Kaur : ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో ఓట‌మి.. భార‌త్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

Skipper Harmanpreet Kaur rues lot of fumbles after India lose Womens Asia Cup final

Harmanpreet Kaur : మ‌హిళ‌ల ఆసియాక‌ప్ టీ20 టోర్నీలో ఓట‌మే ఎరుగ‌కుండా ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చింది భార‌త జ‌ట్టు. అయితే.. ఆఖ‌రి మెట్టు పై బోల్తా ప‌డింది. ఫైన‌ల్‌లో ఆతిథ్య శ్రీలంక చేతిలో హ‌ర్మ‌న్ ప్రీత్ బృందానికి షాక్ త‌గిలింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (60; 47 బంతుల్లో 10ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. అనంత‌రం హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్ ; 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కెప్టెన్‌ చమరి ఆటపట్టు (61; 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అందుకుంది.

IND vs SL 2nd T20 : టీ20 సిరీస్ మనదే.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

ఓట‌మిపై హ‌ర్మన్ స్పంద‌న‌..

కాగా.. ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మి పై టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ స్పందించింది. అన‌వ‌స‌ర త‌ప్పిదాల‌తోనే ఓట‌మి పాలైన‌ట్లుగా చెప్పుకొచ్చింది. ఈ టోర్నీ మొత్తం ఎంతో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసినప్ప‌టికి కీల‌కమైన ఫైన‌ల్ మ్యాచులో మాత్రం దారుణంగా విఫ‌లం అయిన‌ట్లుగా తెలిపింది. త‌మ ప్ర‌ణాళిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా రాణించ‌లేక‌పోయామంది.

‘వాస్త‌వానికి ఈ టోర్నీ మొత్తం అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేశాం. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఫైన‌ల్ మ్యాచులో అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేశాం. అవే మా ఓట‌మిని శాసించాయి. ఇక మేం నిర్దేశించిన ల‌క్ష్యం పోరాడ‌ద‌గిన‌దే. ప‌వ‌ర్ ప్లేనే శ్రీలంక వికెట్ల‌ను ప‌డ‌గొట్టి దెబ్బ‌కొట్టాల‌నే మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయలేక‌పోయాం. లంక బ్యాట‌ర్లు అద్భుతంగా ఆడారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ముందుంది. ఈ క్ర‌మంలో మేము ఎన్నో విష‌యాల్లో మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ ఓట‌మి నుంచి గుణ‌పాఠాల‌ను నేర్చుకుంటాం.’ అని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తెలిపింది.

Paris Olympics 2024 : లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్.. పారిస్ ఒలింపిక్స్‌ సాక్షిగా అర్జెంటీనా అథ్లెట్ జంట ప్రపోజ్..!