IND vs SL 2nd T20 : టీ20 సిరీస్ మనదే.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

IND vs SL 2nd T20 : మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 

IND vs SL 2nd T20 : టీ20 సిరీస్ మనదే.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

IND vs SL 2nd T20 _ Team India Beats Sri lanka by 7 wickets at Pallekele ( Image Source : Google )

IND vs SL 2nd T20 : మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌‌లో టీమిండియా వరుసగా రెండోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులతో భారత్ గెలిచింది. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20 సిరీస్‌ను భారత్ ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదింపు.. 78 టార్గెట్ : 
శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మూడు బంతులు పడేసరికి వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిపివేశారు. కొద్దిసేపటికి వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. అయితే, డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం.. చివరికి భారత్ ఇన్నింగ్స్‌ను 8 ఓవర్లకు కుదించి జట్టు లక్ష్యాన్ని 78 పరుగులుగా ఆంపైర్లు నిర్ణయించారు.

భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26) పరుగులు చేయగా, సంజు శాంసంన్ ఖాతానే తెరవకుండా పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా (22 నాటౌట్), రిషబ్ పంత్ (2 నాటౌట్) అజేయంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ, వానిందు హసరంగా, మతీష పతిరన తలో వికెట్ తీసుకున్నారు.

కుసాల్ పెరీరా హాఫ్ సెంచరీ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దాంతో టీమిండియాకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లంక ఆటగాళ్లలో కుసాల్ పెరీరా (53) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, పాతుమ్ నిస్సాంక (32), కమిందు మెండిస్ (26)తో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో చరిత్ అసలంక (14), కుసాల్ మెండిస్ (10), రమేష్ మెండిస్ (12) , మహేష్ తీక్షణ (2), మతీష్ పతిరన (1 నాటౌట్) పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Read Also : Women’s Asia Cup 2024: భారత్ చేజారిన ఆసియా కప్.. 8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘనవిజయం