Smriti Mandhana 3000 runs in ODI: వన్డేల్లో ఆ ఘనత సాధించిన ధావన్, కోహ్లీ తర్వాతి స్థానంలో స్మృతి మంధాన

అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచింది స్మృతి మంధాన. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఓపెనర్ 2013లో తొలి వన్డే ఆడింది. ఆమె కెరీర్ లో మొత్తం 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Smriti Mandhana 3000 runs in ODI: భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల వన్డేల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇంగ్లండ్ తో ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తోనే స్మృతి మంధాన 3,000 పరుగులు చేసిన ఘనతను సాధించింది. మిథాలీ రాజ్ ఈ ఘనతను 88 వన్డే ఇన్నింగ్స్ లో సాధిస్తే, స్మృతి మంధాన 76 ఇన్నింగ్స్ లోనే సాధించింది. స్మృతి మంధాన యావరేజ్ 43+గా ఉంది. స్ట్రైక్ రేట్ 85. మహిళల వన్డేల్లో ఆమె భారత్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.

మహిళల వన్డేల్లో 3,000 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్ గా నిలిచింది. ఆమె కన్నా ముందు ఈ ఘనతను మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రమే సాధించారు. మరోవైపు, అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచింది స్మృతి మంధాన.

ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఓపెనర్ 2013లో తొలి వన్డే ఆడింది. ఆమె కెరీర్ లో మొత్తం 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లోనూ స్పృతి మంధాన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకింగ్​ చేరుకుంది. టీ20ల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆమె 111 పరుగులు చేసింది. దీంతో రెండో ర్యాంక్ సాధించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా 10వ స్థానం నుంచి ఏడవ స్థానానికి చేరుకుంది.

A Fan gifted Kohli: కోహ్లీ మైదానంలోకి వెళ్తుంటే ఆపి.. బహుమతి ఇచ్చిన అమ్మాయి.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు