Smriti Mandhana couldnt break Shubman Gill World Record
Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది (2025)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశాన్ని స్మృతి మంధాన తృటిలో కోల్పోయింది. మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మంధాన 62 పరుగులు చేసి ఉంటే ఈ రికార్డు సాధించి ఉండేది.
అయితే.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌కు మంధానకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ అరుదైన రికార్డును సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి మంధాన అన్ని ఫార్మాట్లలో కలిపి 1703 పరుగులు చేసింది.
BBL : క్రికెట్‌లో సినిమా క్లైమాక్స్.. 99 నాటౌట్.. సహచర ఆటగాడి కారణంగా టర్నర్ సెంచరీ మిస్..
ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా..
ఇక ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అతడు పెద్దగా రాణించనప్పటికి కూడా వన్డేల్లో, ముఖ్యంగా టెస్టుల్లో భీకరంగా ఆడాడు. మొత్తంగా ఈ ఏడాది అతడు 1764 పరుగులు చేశాడు.
ఇక భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించి సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసింది. అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరిలో వేగంగా ఆడింది.
Renuka Singh : రెడ్ డ్రెస్‌లో టీమ్ఇండియా పేసర్ హోయలు.. ఫోటోలు..
ఆ తరువాత 176 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి, ఆరుంధతి, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జ్యోత్ లు తలా ఓ వికెట్ తీశారు.