Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. ముక్కోణ‌పు సిరీస్ ఫైన‌ల్‌లో శ‌త‌కం.. సిక్స‌ర్ల క్వీన్‌..

ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెన‌ర్ స్మృతి మంధాన శ‌త‌కంతో చెల‌రేగింది.

Smriti Mandhana Creates History Breaks Harmanpreet Kaur Record

ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెన‌ర్ స్మృతి మంధాన శ‌త‌కంతో చెల‌రేగింది. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో శ్రీలంక‌తో మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 101 బంతులు ఎదుర్కొన్న మంధాన 15 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 116 ప‌రుగులు చేసింది. కాగా.. వ‌న్డేల్లో మంధానకు ఇది 11వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో ఆమె అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకుంది.

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ 15 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉంది. కాగా.. భార‌త మ‌హిళల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా ఇప్ప‌టికే మంధాన చ‌రిత్ర సృష్టించింది. ఈ జాబితాలో మిథాలీరాజ్ (7 శ‌త‌కాలు ) ను ఎప్పుడో అధిగ‌మించింది.

Team India : టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌, వైస్ కెప్టెన్ ఫిక్స్‌..! బీసీసీఐ ప్లాన్ ఇదేనా..!

మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్లు వీరే..
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 15 సెంచ‌రీలు
సుజీ బేట్స్ (న్యూజిలాండ్‌) – 13 సెంచ‌రీలు
స్మృతి మంధాన (భార‌త్‌) – 11 సెంచ‌రీలు
టామీ బ్యూమౌంట్ (ఇంగ్లాండ్‌) – 10 సెంచ‌రీలు

సిక్స‌ర్ల క్వీన్‌..

ఈ ఇన్నింగ్స్ తో స్మృతి మంధాన ప్రత్యేక రికార్డు సృష్టించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రీడాకారిణిగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ క్ర‌మంలో హ‌ర్మ‌న్ ప్రీత్ రికార్డును బ్రేక్ చేసింది. హ‌ర్మ‌న్ వ‌న్డేల్లో 53 సిక్స‌ర్లు కొట్ట‌గా మంధాన 54 సిక్స‌ర్లు బాదింది. ఇక రిచా ఘోష్ 20 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో నిలిచింది.

PSL 2025 : ఎవ‌రు ఏమైనా చెప్పండి.. జ‌న్మ‌లో పాక్‌లో అడుగుపెట్ట‌న‌న్న మిచెల్‌.. చిన్న‌పిల్లాడిలా ఏడ్చిన టామ్ కరన్.. పీఎస్ఎల్‌లో విదేశీ క్రికెట‌ర్ల అనుభ‌వాలు..

మ‌హిళల క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ప్లేయ‌ర్లు వీరే..
స్మృతి మంధాన – 54 సిక్స‌ర్లు
హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ – 53 సిక్స‌ర్లు
రిచా ఘోష్ – 20 సిక్స‌ర్లు
మిథాలీ రాజ్ – 19 సిక్స‌ర్లు