Smriti Mandhana scripts history breaks mithali rajs record
Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో భారత మహిళల జట్టు తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత అందుకుంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బ్రేక్ చేసింది. మిథాలీ రాజ్ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. స్మృతి మంధాన 87 వన్డేల్లోనే ఎనిమిదో శతకాన్ని అందుకుంది. ఈ జాబితాలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్లు..
స్మృతి మంధాన – 8* సెంచరీలు
మిథాలీ రాజ్ – 7 శతకాలు
హర్మన్‌ప్రీత్ కౌర్ – 6* శతకాలు
IND vs NZ : మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కీలక నిర్ణయం.. పిచ్ ఎలా స్పందిస్తుందంటే?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ప్లేయర్లలో బ్రూక్ హాలిడే (86; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన (100; 122 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో చెలరేగగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (59; 63 బంతుల్లో 6ఫోర్లు) అర్థశతకంతో రాణించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.