Sourav Ganguly comments on IND vs PAK match in Asia Cup 2025
ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. పాక్ జట్టు కనీస పోరాటపటిమను కూడా ప్రదర్శించలేదు. కాగా.. ఈ మ్యాచ్ పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌ను తాను తొలి 15 ఓవర్లు మాత్రమే చూశానని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వీక్షించానని తెలిపాడు. పాక్ జట్టు ప్రమాణాలు దారుణంగా పడిపోయానని అన్నాడు.
కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ భారత్, పాక్ మ్యాచ్ పై మాట్లాడాడు. ఏదశలోనూ భారత్‌కు పాక్ పోటీ ఇవ్వలేదన్నాడు. తాను మొదటి 15 ఓవర్లు మాత్రమే చూశానని, ఆ తరువాత టీవీ ఛానల్ మార్చి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చూశానని తెలిపాడు.
Hardik Pandya : జాస్మిన్ వాలియాతో కటీఫ్..! హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో భారత్, పాక్ మ్యాచ్‌లు పెద్దగా ఆసక్తిగా ఉండడం లేదన్నాడు. పాక్ కనీసం పోటీ ఇవ్వడం లేదనీ, మ్యాచ్‌లు అన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చాడు. భారత్, పాక్ మ్యాచ్ కంటే టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో ఆడే మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉంటాయన్నాడు. ఆఖరికి భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగుతున్నాయన్నాడు.
తన తరంలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడే దాదా.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, జావేద్ మియాందాద్ వంటి ఆటగాళ్లు ఉన్న పాకిస్తాన్ క్రికెట్ తరాన్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత ఆటగాళ్ల ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో ఎత్తి చూపారు. ప్రస్తుత పాక్ క్రికెట్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి అని తెలిపాడు.
Asia Cup 2025 : పాక్‌కు భంగపాటు.. తలొగ్గని ఐసీసీ.. మ్యాచ్ రిఫరీని తొలగించేది లేదు..
మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే భారత్ బరిలోకి దిగి అద్భుతంగా రాణిస్తోందన్నాడు. పాకిస్తాన్‌తో పాటు ఆసియాకప్‌లో పాల్గొన్న మిగిలిన అన్ని జట్ల కంటే భారత్ ఎంతో ముందంజలో ఉందన్నారు. టీమ్ఇండియా ఎల్లప్పుడూ బెస్ట్ జట్టేనని అన్నాడు.