Sourav Ganguly : ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు.. ముంబై అభిమానుల‌కు సౌర‌వ్ గంగూలీ సందేశం..

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌ను మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పోల్చ‌డం స‌రికాద‌ని టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ క్రికెట్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ అన్నాడు.

Sourav Ganguly

Sourav Ganguly – Hardik Pandya : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌ను మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పోల్చ‌డం స‌రికాద‌ని టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ క్రికెట్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ అన్నాడు. ఆదివారం (ఏప్రిల్ 7) ముంబై ఇండియ‌న్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్న నేప‌థ్యంలో మీడియాతో దాదా మాట్లాడాడు. హార్దిక్‌ను ట్రోలింగ్ చేయ‌డం స‌రికాద‌ని అభిమానుల‌కు సూచించాడు.

ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ఐదు సార్లు జ‌ట్టుకు ఐపీఎల్ టైటిళ్ల‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించిన ముంబై యాజ‌మాన్యం హార్దిక్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ విష‌యం చాలా మంది ముంబై అభిమానుల‌కు రుచించ‌లేదు. దీంతో మైదానంలోనే కాకుండా హార్దిక్ బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా స‌రే సొంత జ‌ట్టు అభిమానులే ట్రోలింగ్ చేస్తున్నారు.

Rajasthan Royals : బెంగ‌ళూరుతో మ్యాచ్‌.. స్పెష‌ల్‌ ‘పింక్’ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగ‌నున్న రాజ‌స్థాన్‌.. కార‌ణం తెలిస్తే..

ఇక హార్దిక్ నాయ‌క‌త్వంలో ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవ‌డం కూడా అత‌డి క‌ష్టాల‌ను రెట్టింపు చేసింది. ముంబై త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను వాంఖ‌డే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్‌కు ముందు జ‌రిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో గంగూలీ మాట్లాడుతూ.. హార్దిక్ ప‌ట్ల అలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ని ముంబై అభిమానుల‌కు సందేశం ఇచ్చాడు.

‘అభిమానులు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయ‌కూడ‌దు. ఇది కరెక్ట్ కాదు. రోహిత్ శ‌ర్మ నెక్ట్ లెవెల్‌. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న వేరే స్థాయిలో ఉంది. అయితే.. ప్రాంఛైజీ కెప్టెన్‌గా నియ‌మించ‌డం హార్దిక్ త‌ప్పు కాదు.’ అని గంగూలీ అన్నాడు.

MS Dhoni : 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్‌కు రావాలా? ఏంటిది రుతురాజ్‌..? కాస్త ముందు పంప‌వ‌య్యా!

అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌రిస్థితి ఏమంత గొప్ప‌గా లేదు. ఈ సీజ‌న్‌లో నాలుగు మ్యాచులు ఆడ‌గా కేవ‌లం ఒక్క మ్యాచులోనే విజ‌యం సాధించింది. రోడ్డు ప్ర‌మాదం అనంత‌రం రీ ఎంట్రీ ఇచ్చిన రిష‌బ్ పంత్ ఫామ్‌లోకి రావ‌డం ఢిల్లీ జ‌ట్టుకు అతి పెద్ద సానుకూలాంశం.

ట్రెండింగ్ వార్తలు