South Africa U19 Vs India U19 2nd Youth Odi Vaibhav Suryavanshi 19 ball half century
Vaibhav Suryavanshi : బెనోని వేదికగా భారత్ అండర్-19, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అండర్-19 జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో జాసన్ రౌల్స్ (114; 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. టీమ్ఇండియా బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆర్ఎస్ అంబ్రిష్ రెండు వికెట్లు, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
🚨 CAPTAIN VAIBHAV SURYAVANSHI SMASHED 68(24) vs SOUTH AFRICA U-19 🚨
– 10 Sixes & 1 four in the Innings by the 14 year old. 🥶 pic.twitter.com/xuWXARyIf9
— Johns. (@CricCrazyJohns) January 5, 2026
ఆ తరువాత 246 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ అయిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) రెచ్చిపోయాడు. తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్లలకు చుక్కలు చూపించాడు. బెనోనిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ 19 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. మొత్తంగా 24 బంతులు ఆడిన వైభవ్ 68 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 10 ఓవర్లలోనే భారత స్కోరు వంద పరుగులు దాటింది.
Vaibhav vikraal Suryavanshi pic.twitter.com/eqiMzYeYvI
— Anuj (@A1iconic) January 5, 2026