South Africa vs India 1st Test Dean Elgar missed double century
South Africa vs India 1st Test : టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 408 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. 249/5 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీ టీమ్ మరో 159 పరుగులు జత చేసి 5 వికెట్లు కోల్పోయింది. డీన్ ఎల్గర్ డబుల్ సెంచరీకి దగ్గరలో శ్రార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు.
మార్కో జాన్సెన్ కూడా సెంచరీ చేయలేకపోయయాడు. 84 పరుగలతో నాటౌట్ గా నిలిచాడు. లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. శ్రార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ తీశారు. భారత్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం లభించింది.
రోహిత్ శర్మ డకౌట్
సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న హిట్ మాన్ పరుగులేమీ చేయకుండానే రబడ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టెస్టుల్లో భారత్ పై రబడ సాధించిన 50వ వికెట్ ఇది. రబడ బౌలింగ్ లో రోహిత్ శర్మ 11 ఇన్నింగ్స్ లో 14.85 సగటుతో 104 పరుగులు మాత్రమే చేసి ఏడు సార్లు అవుటయ్యాడు.
Also Read: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో కెమెరాకు చిక్కిన లవర్స్
యశస్వి జైశాల్ విఫలం
వరుసగా రెండో ఇన్నింగ్స్ లోనూ యువ బ్యాటర్ యశస్వి జైశాల్ విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
శుభమాన్ గిల్ కూడా..
శుభమాన్ గిల్ కూడా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. 26 పరుగులు చేసి అవుటయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 పరుగులు మాత్రమే చేశాడు.