David Miller: విషాదంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియో
భారత్ - దక్షిణాఫ్రికా రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాదంలో మునిగిపోయారు. ఎంతగానో ఇష్టపడే తన ఐదేళ్ల చిన్నారి అభిమాని మరణంతో తీవ్ర కలత చెందారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

David Miller
David Miller: భారత్ – దక్షిణాఫ్రికా రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాదంలో మునిగిపోయారు. ఎంతగానో ఇష్టపడే తన ఐదేళ్ల చిన్నారి అభిమాని మరణంతో తీవ్ర కలత చెందారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. క్యాన్సర్ కారణంగా తను మరణించిందని తెలుస్తోంది. అయితే, ఆ చిన్నారితో కలిసున్న వీడియోను మిలర్ షేర్ చేశారు. అయితే తొలుత ఆ చిన్నారి క్రికెటర్ చిన్నకుమార్తె అనుకున్నప్పటికీ కాదని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిల్లర్ ఎమోషనల్‌గా ఆ చిన్నారి అభిమానికి నివాళులర్పించారు. అంతేకాక లిటిల్ రాక్‌స్టర్‌తో కలిసిన ఉన్న ఫొటోలను వీడియో రూపంలో పంచుకున్నారు.
మిల్లర్ షేర్ చేసిన పోస్టులో.. “నిన్ను చాలా మిస్ అవుతున్నాను స్కట్! నాకు తెలిసిన అతి పెద్ద హృదయం నీది. నీవు పోరాటాన్ని వేరొక స్థాయికి తీసుకెళ్లావు. ఎల్లప్పుడూ చాలా సానుకూలంగా, మీ ముఖంపై చిరునవ్వుతో కనిపించేదానివి. నీ ప్రయాణంలో ప్రతి వ్యక్తిని, ప్రతి సవాలును స్వీకరించారు. జీవితంలో ప్రతిఒక్క క్షణాన్ని ఆదరించడం గురించి నువ్వు నాకు చాలా నేర్పించావు. నేను నీతో కలిసి ప్రయాణం చేసినందుకు గర్వంగా భావిస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ మిల్లర్ పేర్కొన్నారు.
One of David Miller's biggest fan, Ane passed away. She was close to Miller.
Stay strong, @DavidMillerSA12! pic.twitter.com/4ogIbfzQlm
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2022
క్రికెట్ డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో మిల్లర్ తన జట్టుకోసం అద్భుతమైన అర్ధ సెంచరీ చేశాడు. నేడు (9వ తేదీ) దక్షిణాఫ్రికా – భారత్ మధ్య రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో రెండవ వన్డే జరగనుంది.
View this post on Instagram