టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ పేర్లు చెబితే.. 2008లో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ఘటననే అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది. 17 ఏళ్లు గడిచిపోయినా కూడా శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టడానికి ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. దీనిపై భజ్జీ ఎన్నో సార్లు క్షమాపణ చెప్పినప్పటికి కూడా ఇంకా అప్పుడప్పుడు ఈ విషయం పై చర్చ జరగుతూనే ఉంటుంది.
భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ హర్భజన్ మరోసారి ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో ఏదైన మార్చుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్‌తో జరిగిన ఘటననే అని చెప్పుకొచ్చాడు. తాను అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. ఈ విషయమై ఇప్పటికే తాను 200 సార్లు క్షమాపణలు చెప్పి ఉంటానన్నాడు. ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ ఘటనపై ప్రతి సందర్భంలోనూ పశ్చాత్తాపడుతూనే ఉంటానన్నాడు.
IND vs ENG : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్..
అది ఒక పొరపాటు అని చెప్పాడు. మనమంతా తప్పులు చేస్తామని, అయితే.. వాటిని పునరావృతం చేయకూడదన్నాడు. ‘అతడు (శ్రీశాంత్) నా సహచరుడు.. ఇద్దరం కలిసి మ్యాచ్‌లు ఆడాము.. కానీ ఆ మ్యాచ్‌లో మేము ప్రత్యర్థులం.. అయినప్పటికి కూడా నేను అలా చేయకూడదు. నేను కాస్త విజ్ఞతతో ప్రవర్తించి ఉండాల్సింది. అందునే నాదే తప్పు. కానీ శ్రీశాంత్ కూడా నన్ను రెచ్చగొట్టాడు.’ అని భజ్జి అన్నాడు.
కాగా.. ఈ ఘటన జరిగిన చాలా సంవత్సరాల తరువాత శ్రీశాంత్ కూతురిని కలిసినట్లు భజ్జీ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఆ చిన్నారితో ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే.. ఆ చిన్నారి మాత్రం తనతో మాట్లాడడనని చెప్పిందన్నాడు. “నువ్వు మా నాన్నకి కొట్టావు.” అని చిన్నారి అనడంతో తన మనసు ముక్కలైందని భజ్జీ తెలిపాడు.
Rishabh Pant : చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్న రిషబ్ పంత్.. భారీ రికార్డు పై కన్ను..
“ఆమెను తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగానే చూస్తోంది. ఇప్పటికైతే ఆ చిన్నారికి క్షమాపణలు మాత్రమే చెప్పగలను. అంతకు మించి ఏమీ చేయలేను. జరిగిన ఘటనను మార్చలేను. నా పై తన ఉద్దేశాన్ని మార్చేందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధం. ఆ చిన్నారికి ఓ అంకుల్ గా ఎల్లప్పుడుతూ మద్దతుగా ఉంటా. “అని భజ్జీ అన్నాడు.