Rishabh Pant : చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్న రిష‌బ్ పంత్.. భారీ రికార్డు పై క‌న్ను..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అద‌ర‌గొడుతున్నాడు.

Rishabh Pant : చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్న రిష‌బ్ పంత్.. భారీ రికార్డు పై క‌న్ను..

Rishabh Pant eye on Virender Sehwag Ultimate Test Record In Manchester

Updated On : July 21, 2025 / 9:48 AM IST

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు 425 ప‌రుగులు చేశాడు. ఇక జూలై 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు రిష‌బ్ పంత్ ఓ భారీ రికార్డుపై క‌న్నేశాడు.

ఈ మ్యాచ్‌లో గ‌నుక పంత్ మ‌రో మూడు సిక్స‌ర్లు బాదితే.. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. 103 మ్యాచ్‌ల్లో 178 ఇన్నింగ్స్‌ల్లో సెహ్వాగ్ 90 సిక్స‌ర్లు కొట్టాడు.

Karun Nair : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. గుడ్ బై చెప్పేసిన క‌రుణ్ నాయ‌ర్‌..

ఇక పంత్ విష‌యానికి వ‌స్తే.. 46 మ్యాచ్‌ల్లో 81 ఇన్నింగ్స్‌ల్లో 88 సిక్స‌ర్లు బాదాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం రిష‌బ్ ఫామ్ చూస్తుంటే మాంచెస్ట‌ర్ మ్యాచ్‌లోనే ఈ ఘ‌న‌త సాధించే అవ‌కాశం ఉంది.

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్స‌ర్లు
* రిష‌బ్ పంత్ – 45 మ్యాచ్‌ల్లో 88 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్స‌ర్లు
* ర‌వీంద్ర జ‌డేజా – 82 మ్యాచ్‌ల్లో 72 సిక్స‌ర్లు

KL Rahul : సెహ్వాగ్‌, ధోని, కోహ్లీ, రోహిత్‌ల వ‌ల్ల కాలేదు.. కేఎల్ రాహుల్ నాలుగో టెస్టులో 11 ప‌రుగులు చేస్తే..

ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డు బెన్‌స్టోక్స్ పేరిట ఉంది. అత‌డు త‌న టెస్ట్ కెరీర్‌లో 133 సిక్స‌ర్లు కొట్టాడు. బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ 107 సిక్స‌ర్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ 100 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* బెన్‌స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – 133 సిక్స‌ర్లు
* బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (న్యూజిలాండ్‌) – 107 సిక్స‌ర్లు
* ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 100 సిక్స‌ర్లు
* టిమ్ సౌథీ (న్యూజిలాండ్‌) – 98 సిక్స‌ర్లు
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 98 సిక్స‌ర్లు