KL Rahul : సెహ్వాగ్, ధోని, కోహ్లీ, రోహిత్‌ల వల్ల కాలేదు.. కేఎల్ రాహుల్ నాలుగో టెస్టులో 11 పరుగులు చేస్తే..
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.

KL Rahul need 11 runs for 1000 Test runs in England soil
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 11 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. ప్రస్తుతం ఈ ఎలైట్ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్‌లు మాత్రమే ఉన్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు రాహుల్ 12 టెస్టులు ఆడాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో 41.20 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 149. ఇక ఇంగ్లాండ్ గడ్డ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 17 టెస్టుల్లో 54.31 సగటుతో 1575 పరుగులు చేశాడు. ఆ తరువాత 1376 పరుగులతో ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు.
ENG vs IND : వీళ్లు డగౌట్‌కే పరిమితమా..? నీళ్ల బాటిళ్లు అందిస్తూనే ఉండాలా?
ఇంగ్లాండ్ గడ్డ పై 1000 ఫ్లస్ రన్స్ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ – 17 మ్యాచ్‌ల్లో 1575 పరుగులు
రాహుల్ ద్రవిడ్ – 13 మ్యాచ్‌ల్లో 1376 పరుగులు
సునీల్ గవాస్కర్ – 16 మ్యాచ్‌ల్లో 1152 పరుగులు
ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో రాహుల్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 137 పరుగులు.
ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్టు.. రూట్ గనుక 31 పరుగులు చేస్తే..
మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 1-2తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత్ భావిస్తోంది.