SRH : సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త కెప్టెన్..!

క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మార్చి 22న ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే.

SRH

Sunrisers Hyderabad : క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మార్చి 22న ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ కోసం అంద‌రి కంటే ముందుగానే గ‌తేడాది విజేత అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రాక్టీస్ మొద‌లెట్టింది. గ‌త సీజ‌న్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్ఎస్‌) పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున నిలిచింది. ఈ సీజ‌న్‌లో అయినా ఎస్ఆర్‌హెచ్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని అభిమానుల‌తో పాటు ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది.

ఈ క్ర‌మంలోనే ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కొత్త కెప్టెన్‌ను నియ‌మించ‌నుందనే వార్త‌లు వ‌స్తున్నాయి. మార్‌క్ర‌మ్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ పాట్ క‌మిన్స్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు ఎస్ఆర్‌హెచ్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే మినీ వేలంలో ఏకంగా రూ.20.5 కోట్లు వెచ్చించి మ‌రీ సొంతం చేసుకుంది.

నన్ను వదిలేయ్ త‌ల్లీ..! స్టార్ రెజ్ల‌ర్ సంగీత ఫోగ‌ట్‌ను వేడుకున్న చాహల్.. వీడియో వైరల్

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను మార్‌క్ర‌మ్ అద్భుతంగా న‌డిపిస్తున్నాడు. రెండు సీజ‌న్ల‌లోనూ ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. అయిన‌ప్ప‌టికీ ఐపీఎల్‌కు వ‌చ్చే స‌రికి ఆశించిన విధంగా రాణించ‌లేక‌పోతున్నాడు. గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో అత‌డి నాయ‌క‌త్వంలో ఎస్ఆర్‌హెచ్ 14 మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం నాలుగు అంటే నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. 8 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది.

దీంతో ప్ర‌ధాన కోచ్ బ్రియాన్ లారా స్థానాన్ని న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడు డేనియ‌ర్ వెటోరీతో భ‌ర్తీ చేసింది. ఈ క్ర‌మంలోనే కెప్టెన్‌ను మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రికొద్దిరోజుల్లోనే అధికారికంగా ఎస్ఆర్‌హెచ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌నుంది. అటు బౌలింగ్ కోచ్‌గా ఉన్న‌ డేల్ స్టెయిన్ ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి త‌ప్పుకోనున్నాడు. దీంతో అత‌డి స్థానంలో న్యూజిలాండ్ పేస‌ర్ జేమ్స్ ప్రాంక్లిన్ ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉంది.

ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఇదే..

ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, , ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్‌ సుబ్రమణ్యన్‌.

WTC 2023- 25 : ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన టీమిండియా

ట్రెండింగ్ వార్తలు