నన్ను వదిలేయ్ తల్లీ..! స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్‌ను వేడుకున్న చాహల్.. వీడియో వైరల్
డాన్సర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ వివాహం 2020 డిసెంబర్ లో జరిగింది. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్.

Yazvendra Chahal and Sangeeta Phogat
Yazvendra Chahal and Sangeeta Phogat : టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరుపొందిన చాహల్ ఏడాది క్రితం టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లోనూ అతడు స్థానం కోల్పోయాడు. దీంతో లెగ్ స్పిన్నర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉంటే తాజాగా చాహెల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోలో చాహల్ ‘భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ అంటూ రెజ్లర్ ను వేడుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా సరదా కామెట్లు చేస్తున్నారు.
Also Read : Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో యుజ్వేంద్ర చాహెల్ ను స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్ భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ భార్య ధనశ్రీ వర్మ డ్యాన్సర్ అని తెలిసిందే. ఆమె ఝలక్ దిఖ్‌లా జా డాన్స్ షో 11వ ఎడిషన్ ఫైనల్ చేరింది. అయితే, ఈ డాన్స్ షో నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్టీలో ఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.
Also Read : అంబానీ ఇంట్లో ప్రీవెడ్డింగ్ వేడుకలో జహీర్ ఖాన్‌ను ఆటపట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
డాన్సర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ వివాహం 2020 డిసెంబర్ లో జరిగింది. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్. స్వతహాగా ధనశ్రీ వర్మ డాన్సర్ కావడంతో చాహల్ తన సతీమణి డాన్స్ కు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తరచూ షేర్ చేస్తుంటాడు.
Also Read : WTC 2023- 25 : ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన టీమిండియా
View this post on Instagram