SRH vs CSK: ఉప్పల్‌లో ఆసక్తికర పోరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీగా అంచనాలు

SRH vs CSK: బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్‌లో ఓటమిని రుచి చూసింది CSK.

SRH vs CSK

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు అంతా రెడీ అయింది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఓటములతో కసి మీద ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌ ఉండనుంది. మ్యాచ్‌ కోసం SRH ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈసారి టోర్నీని పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది సన్​రైజర్స్. ఫస్ట్ మ్యాచ్‌లో గెలుపు చేజారినా.. సెకండ్‌ మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసి.. ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచేసింది. ఏకంగా రికార్డుస్థాయి స్కోర్ నమోదు చేసి.. ఒక్కసారిగా అభిమానుల్లో ఆశలు నింపింది SRH. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాణించినట్లుగా బ్యాటర్లు అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తోంది ఈసారి కప్‌ మనదేనన్న ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్.

ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం
ముంబైతో జరిగిన మ్యాచ్‌తో ఫ్యాన్స్‌ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది SRH. CSKతో జరిగే మ్యాచ్‌కు ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం ఉంది. స్టేడియం ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సేమ్‌ టైమ్‌ సిటీలో ఫ్యాన్స్ సందడి పెరిగే చాన్స్ ఉంది. టికెట్లు దొరకని ఫ్యాన్స్ స్పెషల్ ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి మ్యాచ్‌ లైవ్‌ టెలికాస్ట్ చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమ్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతడు బౌలింగ్​లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ భీకర ఫామ్‌లో ఉండటం టీమ్‌కు కొండంత బలం. వాళ్లు గానీ క్రీజులో సెటిల్ అయ్యారా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ట్రావిస్ హెడ్ కూడా సూపర్ టచ్​లో ఉన్నాడు. లోయరార్డర్‌లో అబ్దుల్ సమద్ రాణిస్తుండటం టీమ్‌కు మరో ప్లస్. అయితే జట్టుకు బౌలింగ్ మైనస్‌గా మారింది. కమిన్స్ తప్పితే ఎవరూ నిలకడగా పెర్ఫార్మ్ చేయడం లేదు.

మూడో మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి
మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ, రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన చెన్నై.. మూడో మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్‌లో ఓటమిని రుచి చూసింది CSK. రుతురాజ్​ బ్యాటింగ్‌లో కన్​సిస్టెన్సీ లోపించింది. శివమ్ దూబె కూడా స్లోగా ఆడటం సీఎస్‌కేను ఇబ్బంది పెడతుంది. బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కనిపిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.

ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో సన్​రైజర్స్ గెలవడం ఖాయమన్న అంచనాలున్నాయి. SRH, CSK ఇప్పటివరకు 19 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 సార్లు సీఎస్‌కే నెగ్గగా..5 మార్లు SRH​విజయం సాధించింది. రికార్డుల పరంగా చెన్నై ముందంజలో ఉన్నా.. SRH బ్యాటింగ్ డెప్త్, ఆ టీమ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన.. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో సన్‌రైజర్స్‌కే ఎక్కువగా గెలుపు అవకాశాలున్నాయి. అయితే రెండు జట్లు పటిష్ఠంగా ఉండటంతో టఫ్‌ ఫైట్ పోటీ తప్పేలా లేదు.

Also Read: కేకేఆర్ POTM అవార్డుల ఎలైట్ జాబితాలో సునీల్ నరైన్.. ర‌సెల్ రికార్డు స‌మం

ట్రెండింగ్ వార్తలు