×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం.. బ్యాటింగ్ కోచ్‌గా భార‌త మాజీ ఆట‌గాడు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (T20 World Cup 2026) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది

Sri Lanka appoint Vikram Rathour as batting coach Ahead Of T20 World Cup 2026

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం
  • శ్రీలంక జ‌ట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్ర‌మ్ రాథోడ్
  •  క‌న్స‌ల్టెన్సీ ప్రాతిప‌దిక‌న నియామ‌కం

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త మాజీ బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌ను శ్రీలంక జ‌ట్టు బ్యాటింగ్ కోచ్‌గా క‌న్స‌ల్టెన్సీ ప్రాతిప‌దిక‌న నియ‌మించింది. జ‌న‌వ‌రి 18న రాథోడ్ శ్రీలంక జ‌ట్టుతో చేర‌నున్నాడు. అత‌డు మార్చి 10 వ‌ర‌కు ఈ పాత్ర‌లో కొన‌సాగ‌నున్నాడు.

విక్ర‌మ్ రాథోడ్ సెప్టెంబ‌ర్ 2019 నుండి జూలై 2024 వ‌ర‌కు భార‌త పురుషుల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ప‌ని చేశాడు. ప్ర‌స్తుతం అత‌డు ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. ఇప్ప‌టికే లంక జ‌ట్టు త‌మ ఫీల్డింగ్ కోచ్‌గా భార‌త మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథ‌ర్ ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే.

WPL 2026 : శుక్ర‌వారం నుంచే డ‌బ్ల్యూపీఎల్ నాలుగో సీజ‌న్‌.. మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. భార‌త్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఈ టోర్నీలో ఐర్లాండ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమ‌న్‌ల‌తో పాటు శ్రీలంక గ్రూప్ బిలో ఉంది. లంక జ‌ట్టు ఈ మెగాటోర్నీలో త‌మ తొలి మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 8న కొలంబో వేదిక‌గా ఐర్లాండ్‌తో ఆడ‌నుంది.