Sri Lanka : జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. లంక (Sri Lanka) జట్టుకు జరిమానా విధించింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును నమోదు చేయడంతో లంక జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానాగా విధించింది.
నిర్ణీత సమయానికి ఓ ఓవర్‌ను లంక జట్టు తక్కువగా వేసినట్లుగా తెలిసింది. కనీస ఓవర్-రేట్ నేరాలకు సంబంధించిన ICC ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయ సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.
DPL 2025 : దిగ్వేష్ రాఠీతో వివాదంపై స్పందించిన నితీశ్ రాణా.. నన్ను రెచ్చగొడితే ఊరుకోను..
ఇక ఈ నేరాన్ని అంగీకరించడంతో పాటు శిక్షను లంక కెప్టెన్ చరిత్ అసలంక ఒప్పుకోవడంతో తదుపరి దీనిపై ఎలాంటి విచారణ ఉండదని తెలిపింది.
సెప్లెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి ముందు లంక జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆతిథ్య జింబాబ్వేతో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
తొలి వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో లంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక (76), జనిత్ లియానేజ్ (70 నాటౌట్), కమిండు మెండిస్ (57) లు హాఫ్ సెంచరీలు చేశారు.
అనంతరం 299 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులకే పరిమితమైంది. దీంతో లంక జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా (92), బెన్ కర్రాన్(70), సీన్ విలియమ్స్ (57) లు హాఫ్ సెంచరీలు చేశారు.