IND vs SL 1st T20I : తొలి టీ20లో టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్.. టీమిండియాలో ఆరు మార్పులు..!

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20సీరీస్‌లో భాగంగా లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

IND vs SL 1st T20I : టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఆరు మార్పులతో బరిలోకి దిగుతోంది. భారత జట్టులోకి రవీంద్ర జడేజా, బుమ్రా చేరారు. రవి బిష్ణోయ్ కు చోటు దక్కలేదు. దీపక్ హుడా టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.

ఇక భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. స్పిన్నర్ చాహల్ కూడా స్పిన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడింది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌లు దూరమయ్యారు. దీపక్‌ చహర్ తొడ కండరాల గాయంతో లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాయంతో దూరమయ్యాడు. కోహ్లీ, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

శ్రేయస్ అయ్యర్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. తుది జట్టులో చోటు దక్కిన సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్ తర్వాత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వరుసు ఓటమిలతో ఇబ్బందిపడుతున్న శ్రీలంక ఈ సిరీస్‌లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియా ప్రస్తుతం.. T20I ర్యాంక్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. శ్రీలంక ఆస్ట్రేలియాపై 1-4తో పరాజయం పాలై జట్టు ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో పడిపోయింది.

Sri Lanka Have Won The Toss And They Will Bowl First In The 1st T20i

తుది జట్లు (అంచనా) :
భారత జట్టు :
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా , సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్,
హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)

శ్రీలంక జట్టు  :
పాతుమ్ నిస్సంక, కమిల్ మిషారా, చరిత్ అసలంక (వైస్-కెప్టెన్), దినేష్ చండిమాల్, జనిత్ లియానగే, దాసున్ షనక (కెప్టెన్), చామికా కరుణరత్నే, జెఫ్రీ
వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార

Read Also : Rohit Sharma: బుమ్రాది గొప్ప క్రికెట్ మైండ్ – రోహిత్ శర్మ

ట్రెండింగ్ వార్తలు