India vs SriLanka T20 Match: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న శ్రీలంక.. హార్ధిక్ సేన అడ్డుకోగలదా?

ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

India vs SriLanka T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. రాజ్‌కోట్ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తికాగా.. చెరొక మ్యాచ్‌ను గెలిచి 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించాలని భావిస్తుంది.

India vs Srilanka T20 Match: సిరీస్ ఎవరిదో తేలేది నేడే.. ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మక మ్యాచ్..

భారత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో ఇండియా 18 మ్యాచ్‌లలో విజయం సాధించగా, శ్రీలంక జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. వీటిల్లో ఇండియాలో 16 మ్యాచ్‌లు జరిగాయి. 12 మ్యాచ్‌లు ఇండియా గెలుచుకోగా, మూడు మ్యాచ్‌లలో శ్రీలంక గెలుపొందింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు శ్రీలంక గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

India vs Srilanka 1st T20 Match: ఉత్కంఠ పోరులో శ్రీలంక జట్టుపై టీమిండియా విజయం (ఫొటో గ్యాలరీ)

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. జట్టులో యువ ఆటగాళ్లు అధికశాతం ఉన్నారు. దూకుడుమీదన్న శ్రీలంకను యువకులతో కూడిన భారత్ జట్టు ఎలా నిలువరిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో హార్ధిక్ కెప్టెన్సీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. హార్ధిక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడు మ్యాచ్‌లలో టీమిండియా ఒకేఒక్క మ్యాచ్ ఓడిపోయింది. ఇదిలాఉంటే స్వదేశంలో టీమిండియా 11 టీ20 సిరీస్‌లు గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది. 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత వరుస విజయాలతో సిరీస్‌లను గెలుచుకుంటూ వస్తున్న టీమిండియాకు శ్రీలంక చెక్‌పెట్టి తొలిసారి భారత్ గడ్డపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు