Sri Lanka ODI squad for England Series Charith Asalanka Captain
SL vs ENG : స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులు గల బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. చరిత్ అసలంక సారథ్యంలో శ్రీలంక బరిలోకి దిగనుంది. చాలాకాలం తరువాత వన్డే జట్టులోకి దుష్మంత చమీర, ధనంజయ డి సిల్వాలు చోటు దక్కించుకున్నారు.
గురువారం జనవరి 22న తొలి వన్డే జరగనుండగా, 24న రెండో వన్డే, 27న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మూడు వన్డే మ్యాచ్‌లు కూడా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. 2018 తరువాత ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడడం ఇదే తొలిసారి.
Charith Asalanka is back as captain for Sri Lanka’s ODI series against England.#SLvENG #CharithAsalanka pic.twitter.com/nCjKXDt606
— Cricbuzz (@cricbuzz) January 21, 2026
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇదే..
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషారా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, పవన్ రత్నాయకే, ధనంజయ డి సిల్వా, జనిత్ లియానేజ్, కమిందు మెండిస్, దునిత్ వెల్లగే, వానిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, మహీష్ తీక్షణ, మిలన్ రత్నాయకే, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మదుషాన్, ఎషాన్ మలింగ.