India vs Sri lanka 1st odi: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక 

india vs sri lanka odi

India vs Sri lanka 1st odi: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఆ మ్యాచులో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 373 పరుగులు చేయగా, శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 67 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మొదటి వన్డేలో ఇరు జట్లు పరుగుల వరద పారించడంతో ఈ మ్యాచులోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్ తుది జట్టులో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

శ్రీలంక తుది జట్టులో ఏ ఫెర్నాండో, కే మెండీస్, డీడీ సిల్వా, ఎన్ ఫెర్నాండో, అసలంకా, శనకా, హసరంగా, కరుణరత్నే, వెల్లలగె, కె రాజిత, కుమారా ఉన్నారు.

Viral video: కాబోయే భార్యకు విమానంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు