Sri Lanka won by 73 runs in 2nd t20 against West Indies and level the series
SL vs WI : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పంజా విసిరింది. దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో 73 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిసాంక (54; 49 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్) అర్థశతకం బాదాడు. కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 26 పరుగులు), కుశాల్ పెరీరా (16 బంతుల్లో 24 పరుగులు) లు ఫర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు తీశాడు. షామర్ స్ప్రింగర్, షామర్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ ఘోరంగా తడబడింది. 16.1 ఓవర్లలో 89 పరుగులకు కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో రోమన్ పావెల్ (20), అల్జారీ జోసెఫ్ (16), రూథర్‌ఫర్డ్ (14) లు మాత్రమే రెండు అంకెల స్కోర్ సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగె మూడు వికెట్లు తీశాడు. అసలంక, హసరంగ, తీక్షణలు తలా రెండు వికెట్లు సాధించారు. పతిరనా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ స్కోరు కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జట్టు 11 మంది బ్యాటర్ల 5, 7, 4, 0, 14, 4, 20, 1, 7, 16, 5.. స్కోరు కార్డును పోస్ట్ చేస్తూ వెస్టిండీస్ ఫోన్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి, కీలక మూడో టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్