మళ్లీ అదే జపం.. భార్య వల్లే గెలిచానంటోన్న కోహ్లీ

మళ్లీ అదే జపం.. భార్య వల్లే గెలిచానంటోన్న కోహ్లీ

Updated On : April 14, 2019 / 12:19 PM IST

సీజన్ ఆరంభమై 7 మ్యాచ్‌లు పూర్తి అయితే గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అన్ని మ్యాచ్‌లలోనూ ఘోర వైఫల్యం. సీనియర్.. మాజీ క్రికెటర్ల నుంచి కెప్టెన్సీపై విమర్శల వర్షం. అన్నింటికీ బ్రేక్ ఇచ్చేందుకు మొహాలీ వేదికగా పంజాబ్‌పై విజయం సాధించింది ఆర్సీబీ. చేధనలో తమ జట్టు ప్లేయర్ డివిలియర్స్ చేసిన అద్భుత ప్రదర్శనకు ఎట్టకేలకు విజయం సాధించింది.

మ్యాచ్ విజయానంతరం సరదాగా మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ.. జట్టు ఇప్పుడిప్పుడే బలపడుతుందని అంతా కలిసి కట్టుగా ఉండి విజయం సాధించామని చెప్పాల్సిందిపోయి భార్యాబలం అని చెప్పుకొచ్చాడు. పైగా ఇంటర్వ్యూ చేసింది కూడా ఆ గేమ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డివిలియర్స్. 

దీనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా జట్టులో ప్రేరణ నింపాల్సిందిపోయి భార్య అనుష్క శర్మ ప్రోత్సాహం వల్లనే నేను పాజిటివ్‌గా ఉంటున్నాను. ఈ విజయం సాధించగలిగానని చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఈ వీడియో చూసిన నెటిజన్లు విరాట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే కోహ్లీని చెత్త కెప్టెన్ అంటారని, డివిలియర్స్ మ్యాచ్ గెలిపిస్తే అనుష్కా పేరు చెప్తాడేంట్రా బాబు అని సెటైర్లు వేస్తున్నారు.