T20 World Cup 2024 : టీమ్ఇండియా టీ20ప్ర‌పంచ‌క‌ప్ ప్రొమో చూశారా..? గూస్‌ బంప్స్ రావ‌డం ప‌క్కా!

స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ భార‌త జ‌ట్టు కోసం ఓ ప్ర‌త్యేక ప్రోమో వీడియోను విడుద‌ల చేసింది.

T20 World Cup : ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసిన వారం రోజుల వ్య‌వ‌ధిలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జ‌ర‌గ‌నుంది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దినుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. భార‌త్‌, ఐర్లాండ్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదిక కానుంది.

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు కోసం ఓ ప్ర‌త్యేక ప్రొమో వీడియోను విడుద‌ల చేసింది. బ్యాక్ గ్రౌండ్‌లో వందేమాత‌ర గీతం వ‌స్తుండ‌గా.. కోహ్లి, సూర్య‌కుమార్, పాండ్యా, రోహిత్ ల బ్యాటింగ్ విన్యాసాలు, జ‌డేజా బౌలింగ్ విన్యాసాల‌ను చూపించారు. దాదాపు 30 సెక‌న్ల పాటు ఉన్న వీడియో క్రికెట్ అభిమానుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తోంది.

RR vs MI : ముంబై ఓటమికి రెండు పెద్ద కారణాలు చెప్పిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

ఇక వీడియో చివ‌రిలో స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి సెల్యూట్ చేయ‌డం అభిమానుల్లో జోష్ నింపింది. ప్ర‌పంచ‌క‌ప్ కు టీమ్ఇండియా సిద్ధం అని క్యాప్ష‌న్ ఇస్తూ ఈ వీడియోను స్టార్‌స్పోర్ట్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన 20 జట్లు ఇవే..
అమెరికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా

ఏ గ్రూపులో ఏ జ‌ట్లు ఉన్నాయంటే ?
గ్రూప్ A – భారతదేశం, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా
గ్రూప్ B – ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ C – న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్ D – దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

Viral Video : వెనుక నుంచి వ‌చ్చి రోహిత్ శ‌ర్మ‌కు ముద్దు ఇవ్వ‌బోయిన షేన్‌బాండ్‌..

టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే..
జూన్ 5 న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదిక‌
జూన్ 9న‌ పాకిస్తాన్‌తో న్యూయార్క్ వేదిక‌
జూన్ 12న‌ అమెరికాతో న్యూయార్క్ వేదిక‌
జూన్ 15న‌ కెనడాతో ఫ్లోరిడా వేదిక‌

ట్రెండింగ్ వార్తలు