RR vs MI : ముంబై ఓటమికి రెండు పెద్ద కారణాలు చెప్పిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

మేము ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడ్డాం. కానీ, తిలక్ వర్మ, నేహాల్ వధేరా ఆడిన విధానం అద్భుతంగా ఉంది. మేము ఊహించని విధంగా ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేక పోయాం.

RR vs MI : ముంబై ఓటమికి రెండు పెద్ద కారణాలు చెప్పిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా

Hardik Pandya

Rajasthan vs Mumbai : ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు మరోసా ఓటమిని చవిచూసింది. సోమవారం ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్ఆర్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల టార్గెట్ ని రాజస్తాన్ 18.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Namrata Shirodkar : పాట్ కమ్మిన్స్‌తో నమ్రత స్పెషల్ సెల్ఫీ.. SRH‌కి సపోర్ట్ చేస్తూ పోస్ట్.. ఈసారి SRH కప్పు కొట్టినట్టేనా?

మేము ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడ్డాం. కానీ, తిలక్ వర్మ, నేహాల్ వధేరా ఆడిన విధానం అద్భుతంగా ఉంది. మేము ఊహించని విధంగా ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేక పోయాం. 10 నుంచి 15 పరుగులు తక్కువ చేశామని హార్దిక్ పాండ్యా అన్నారు. బౌలింగ్ లో విషయంలోనూ మేము సరియైన బంతులను సంధించలేక పోయాం. పవర్ ప్లే లో బ్యాటర్ కు దూరంగా బౌలింగ్ చేశాం. మాకు ఏ విభాగంలోనూ కలిసిరాలేదు. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేక పోయాం. ప్రతిఒక్కరూ తప్పులను సరిదిద్దుకొని.. వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటామని హార్దిక్ పాండ్యా అన్నారు.

Also Read : T20 World Cup 2024 : ఆ డోర్స్ క్లోజ్..! టీ20 వరల్డ్ క‌ప్‌లో ఆడే విషయంపై క్లారిటీ ఇచ్చిన సునీల్ నరైన్

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే.. 16 పాయింట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై చేతిలో ఆరు మ్యాచ్ లు ఉన్నాయి.. ఇందులో కనీసం ఐదు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అందులోనూ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా.. ప్రతీమ్యాచ్ లోనూ భారీ విజయాన్ని నమోదు చేస్తే ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.