T20 World Cup 2024 : ఆ డోర్స్ క్లోజ్..! టీ20 వరల్డ్ క‌ప్‌లో ఆడే విషయంపై క్లారిటీ ఇచ్చిన సునీల్ నరైన్

ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతున్నాడు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతోపాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ ..

T20 World Cup 2024 : ఆ డోర్స్ క్లోజ్..! టీ20 వరల్డ్ క‌ప్‌లో ఆడే విషయంపై క్లారిటీ ఇచ్చిన సునీల్ నరైన్

Sunil Narine

Sunil Narine : వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో వెస్టిండీస్ జట్టు తరపున ఆడే విషయంలో క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ కు సునీల్ నరైన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడు విండీస్ తరపున చివరి మ్యాచ్ 2019లో ఆడాడు. ప్రస్తుతం నరైన్ ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో నరైన్ అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అద్బుత ప్రతిభ కనబరుస్తున్నాడు.

Also Read : IPL 2024 : జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2024లో ఎనిమిది మ్యాచ్‌ల‌లో ఎన్ని డాట్ బాల్స్ వేశాడో తెలుసా?

ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతున్నాడు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతోపాటు ఆ జట్టు టీ20 కెప్టెన్ రోవ్‌మ‌న్‌ పావెల్ సైతం రిటైర్మెంట్ ను పక్కకు పెట్టి జాతీయ జట్టుకు ఆడాలని నరైన్ ను కోరారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకొని టీ20 వరల్డ్ కప్ 2024లో సునీల్ నరైన్ భాగస్వామ్యం కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై విండీస్ క్రికెట్ బోర్డు నుంచి కానీ నరైన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ విషయంపై సునీల్ నరైన్ స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ లో టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన యశస్వి.. ముంబైపై రాజస్తాన్ ఘన విజయం

ఐపీఎల్ 2024లో నా ప్రదర్శనతో అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకొని టీ20 ప్రపంచ కప్ లో ఆడాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, ఆ జట్టు సభ్యులు కోరడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు నేను సిద్ధంగా లేను. జూన్ నెలలో వెస్టిండీస్ జట్టుకోసం మైదానంలోకి వచ్చే ఆటగాళ్లకు నా మద్దతు ఉంటుంది. గత కొన్ని నెలలుగా కష్టపడి వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న కుర్రాళ్లు.. అభిమానులకు వారు మరో టైటిల్ ను అందించగలరని నేను భావిస్తున్నాను. నా మద్దతు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సునీల్ నరైన్ తెలిపారు.