Viral Video : వెనుక నుంచి వచ్చి రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన షేన్‌బాండ్..
రోహిత్ శర్మకు ముద్దు పెట్టబోయాడు. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.

Rohit Sharmas hilarious reaction after Shane Bonds cheeky kiss attempt
ఐపీఎల్ 2024 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన సహచర టీమ్ఇండియా ఆటగాడు అశ్విన్ పక్కన నిలుచోని ఎవరితోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెనక నుంచి వచ్చి రోహిత్ శర్మకు ముద్దు పెట్టబోయాడు. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.
Sunil Narine : ఐపీఎల్‌లో సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర.. బుమ్రా బద్దలు కొట్టేనా?
బాండ్ ను చూసిన రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాగా.. షేన్ బాండ్, రోహిత్ శర్మలకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. రోహిత్ శర్మ ముంబై కెప్టెన్‌గా ఉన్నప్పుడు బాండ్ ఆ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ ఏడు మ్యాచులు ఆడగా ఆరింటిలో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై జట్టు ఏడు మ్యాచులు ఆడగా మూడింటిలో గెలుపొందింది. 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 15, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలుపొందాయి.
Some ????? are priceless ??#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/s627hbYzuN
— Mumbai Indians (@mipaltan) April 21, 2024