Sunil Narine : ఐపీఎల్‌లో సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర.. బుమ్రా బద్దలు కొట్టేనా?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు.

Sunil Narine overtakes Lasith Malinga for this big record in IPL
KKR bowler Sunil Narine : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు లసిత్ మలింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఆర్‌సీబీతో మ్యాచ్లో కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రార్‌ల వికెట్లు తీసి ఐపీఎల్‌లో ఒకే ప్రాంఛైజీకి ఆడుతూ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. 169 మ్యాచుల్లో నరైన్ 172 వికెట్లు తీశాడు. గతంలో ఈ రికార్డు లసిత్ మలింగ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ తరుపున మలింగ 122 మ్యాచుల్లో 170 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తరువాత బుమ్రా (158), భువనేశ్వర్ కుమార్ (150) లు ఉన్నారు.
PAK vs NZ : పాక్ ఫీల్డర్లా మజాకా..! బంతి చేతుల్లో పడినా.. బ్యాట్స్‌మెన్‌కు భయం అక్కర్లలేదు!
ఒకే ఫ్రాంచైజీకి ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 172 వికెట్లు
లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్) – 170
జస్ ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) – 158
భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 150
డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్) – 140
ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. వివిధ జట్ల తరుపున అతడు 152 మ్యాచుల్లో 199 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్రావో (183), పియూశ్ చావ్లా (181), భువనేశ్వర్ కుమార్ (174)లు ఉన్నారు.
ఇక ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఛేదనలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221పరుగులకు ఆలౌటైంది.