PAK vs NZ : పాక్ ఫీల్డర్లా మజాకా..! బంతి చేతుల్లో పడినా.. బ్యాట్స్‌మెన్‌కు భయం అక్కర్లలేదు!
అనిశ్చితికి మారు పేరు పాకిస్తాన్. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరికి తెలియదు.

Pakistan fielders drops catches of chapman then newzealand win by 7 wickets
అనిశ్చితికి మారు పేరు పాకిస్తాన్. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇక ఆ జట్టు ప్లేయర్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి ఉన్న సంగతి తెలిసిందే. క్యాచులు పడితేనే మ్యాచులు గెలవగలం అని దాని అర్థం. ఈ రోజుల్లో ఒక్క క్యాచ్ మిస్ చేసినా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంటుంది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్యాచ్‌లను మిస్ చేస్తే.. అది కూడా ఒకే బ్యాట్స్‌మెన్ ది అయితే. ఇక చెప్పేది ఏముంది ఆ ఆటగాడు మ్యాచ్‌ను అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇది అనుభవపూర్వకంగా తెలిసోచ్చింది. రావల్సిండి వేదికగా ఆదివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాబాద్ ఖాన్ (41), బాబర్ ఆజాం (37), సైమ్ అయూబ్ (32) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ 178 పరుగులు చేసింది.
అనంతరం ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ ఆటగాళ్లలో మార్క్ చాప్మన్ (87; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రీది రెండు వికెట్లు తీయగా, నసీమ్ షా ఓ వికెట్ పడగొట్టాడు.
మూడు క్యాచులు..
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది. అజేయ అర్థశతకంతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ మార్క్ చాప్మన్ కి మూడు సార్లు అదృష్టం కలిసొచ్చింది. వాస్తవానికి అతడు 16 పరుగుల వద్దే ఔట్ కావాల్సి ఉంది. షాబాద్ బౌలింగ్‌లో చాప్మన్ షాట్ ఆడగా బంతి పైకి లేచింది ఎంతో ఈజీ క్యాచ్‌ను నసీం షా జారవిడిచాడు. ఆతరువాత 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో చాప్మన్ షాట్ ఆడగా ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ చేతుల్లో పడింది. దాన్ని అతడు జారవిడిచాడు.
ఆ తరువాత కివీస్ విజయానికి మరో 24 పరుగులు అవసరం అయిన సమయంలో చాప్మన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బౌలర్ అబ్రార్ అహ్మద్ వదిలేశాడు. ఈ మూడు జీవనధానాలను సద్వినియోగం చేసుకున్న చాప్మన్ తన జట్టును గెలిపించుకున్నాడు.
కాగా.. పాకిస్తాన్ ఫీల్డర్లు చాప్మన్ క్యాచులు జారవిడిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Mark Chapman – too hot to handle for Pakistani fielders. ??
– 3 drop catches last night of Chapman. pic.twitter.com/yHjhCJrlY0
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2024