PIC: @ICC
India vs South Africa: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్‌ను దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో ఓడించి 15 సంవత్సరాల తర్వాత ఇండియాలో తొలి విజయం నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159, రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 124 పరుగులు బాదితే గెలిచేది. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీమ్ ఇండియా వికెట్లు పటాపటా పడిపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఔట్ అయింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది. (India vs South Africa)
దీంతో భారత్‌లో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో అతి తక్కువ పరుగుల లక్ష్యం ఇచ్చి గెలిచిన జట్లలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది.
Also Read: భారత్‌కు షాక్.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం.. అంతా ఈ బౌలర్ వల్లే..
భారత్‌లో 2004/05లో జరిగిన టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియాకు టీమ్ ఇండియా ఓ టెస్ట్ మ్యాచులో 107 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. 13 పరుగల తేడాతో భారత్ గెలిచింది. మనదేశంలోనే ఆడి, అతి తక్కువ పరుగుల లక్ష్యం ఇచ్చి గెలిచిన జట్లలో మనదేశమే మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు, అతి తక్కువ లక్ష్యం ఉన్నప్పటికీ భారత్ ఓడిపోయిన మ్యాచుల లిస్టులో కూడా నేటి మ్యాచు రెండో స్థానంలో ఉంది. బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో 1996/97లో జరిగిన మ్యాచులో భారత్ ముందు ఆతిథ్య జట్టు 120 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా దాన్ని టీమ్ ఇండియా ఛేదించలేకపోయింది. దీంతో అప్పట్లో వెస్టిండీస్ 38 రన్స్‌తో గెలిచింది.
భారత్‌లో అతి తక్కువ లక్ష్యం.. గెలిచిన జట్లు
| లక్ష్యం | జట్టు | ప్రత్యర్థి | గ్రౌండు | సీజన్ | గెలుపు |
|---|---|---|---|---|---|
| 107 | భారత్ | ఆస్ట్రేలియా | వాంఖడే | 2004/05 | 13 రన్స్‌తో |
| 124 | దక్షిణాఫ్రికా | భారత్ | ఈడెన్ గార్డెన్స్ | 2025/26 | 30 రన్స్‌తో |
| 147 | న్యూజిలాండ్ | భారత్ | వాంఖడే | 2024/25 | 25 రన్స్‌తో |
| 170 | భారత్ | దక్షిణాఫ్రికా | అహ్మదాబాద్ | 1996/97 | 64 రన్స్‌తో |
ఓవరాల్‌గా అతి తక్కువ లక్ష్యం ఉన్నప్పటికీ భారత్ ఓడిపోయిన మ్యాచులు ఇవే..
| లక్ష్యం | ప్రత్యర్థి | గ్రౌండు | సీజన్ | తేడా |
|---|---|---|---|---|
| 120 | వెస్టిండీస్ | బ్రిడ్జ్‌టౌన్ | 1996/97 | 38 రన్స్‌తో |
| 124 | దక్షిణాఫ్రికా | ఈడెన్ గార్డెన్స్ | 2025/26 | 30 రన్స్‌తో |
| 147 | న్యూజిలాండ్ | వాంఖడే | 2024/25 | 25 రన్స్‌తో |
| 176 | శ్రీలంక | గాల్ | 2015 | 63 రన్స్‌తో |
| 193 | ఇంగ్లాండ్ | లార్డ్స్ | 2024 | 22 రన్స్‌తో |
| 194 | ఇంగ్లాండ్ | బర్మింగ్‌హామ్ | 2018 | 31 రన్స్‌తో |